: మన సైనికలు మృతి చెందినట్లు చూపించే వీడియోలు, ఫొటోలు షేర్ చేయొద్దు.. అదంతా బూటకం!: భారత్ ఆర్మీ
భారత్ సైనికులు మృతి చెందినట్లు చూపించే వీడియో క్లిప్ లు, ఫొటోలు కనుక వస్తే వాటిని షేర్ చేయవద్దని భారత్ ఆర్మీ కోరింది. ఈ తరహా వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయని, అదంతా బూటకమని, నమ్మవద్దని నెటిజన్లకు సూచించింది. ఇటువంటి వాటిని ఎవరికీ షేర్ చేయవద్దని, మీడియా కూడా ప్రసారం చేయవద్దని సూచించింది. భారత్ సైన్యం నిర్దేశిత దాడులకు దిమ్మ తిరిగిన పాకిస్థాన్ కు ఏం చెయ్యాలో అర్థం కాక, ఇటువంటి వీడియోలను, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి బూటకపు ప్రచారం చేస్తోందని ఆర్మీ పేర్కొంది.