: పాక్ అణుబాంబుల విషయంలో హిల్లరీ క్లింటన్ ఆందోళన
పిచ్చోడి చేతిలో రాయి అనే సామెత వినే ఉంటారు. మతి స్థిమితం లేని వాడి చేతిలో రాయి ఉంటే దానితో అతడు ఏ అపాయం కలిగిస్తాడోనన్న భయం ఉంటుంది. అలాగే, దాయాది దేశం పాకిస్థాన్ చేతిలో అణుబాంబులు ఇప్పుడు మనల్ని ఆందోళనకు గురి చేసే విషయం. అంతేకాదు, అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీ చేస్తున్న, త్వరలో అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించే వ్యక్తిగా భావిస్తున్న హిల్లరీ క్లింటన్ సైతం పాక్ అణుబాంబుల విషయంలో ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. పాకిస్తాన్ అణ్వాయుధాలు, అణుబాంబులు జీహాదీల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని హిల్లరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భయపెట్టే అంశంగా పేర్కొన్నారు. భారత్ తో విరోధం నేపథ్యంలో పాకిస్తాన్ తన అణ్వాయుధాల తయారీని వేగవంతం చేసిందంటూ ఆమె తన సన్నిహిత వ్యక్తితో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అన్నట్టు న్యూాయార్క్ టైమ్స్ తెలిపింది. జీహాదీలు తిరుగుబాటు చేసి పాక్ ప్రభుత్వాన్ని అధీనంలోకి తీసుకుంటే అణ్వాయుధాలు వారి చేతికి వెళతాయేమోనన్న భయంలో ఉన్నామని ఆమె పేర్కొన్నారు.