: ‘పాక్’కు స్థానిక న్యూస్ ఛానెళ్ల షాక్.. దాడి జరిగిన ప్రాంతాలను ప్రసారం చేస్తున్న వైనం
పాక్ భూభాగంలోకి భారత్ సైన్యం ప్రవేశించి ఎటువంటి దాడులకు పాల్పడలేదని బుకాయిస్తున్న పాకిస్థాన్ సైన్యానికి, ప్రభుత్వానికి అక్కడి స్థానిక ఛానెళ్లు షాక్ ఇస్తున్నాయి. భారత్ సైన్యం నిర్దేశిత దాడులకు పాల్పడి మట్టుబెట్టిన ఉగ్రవాద స్థావరాలను ఆయా ఛానెళ్లు ప్రసారం చేస్తున్నాయి. పాకిస్థాన్ కు చెందిన జాతీయ వార్తా సంస్థ లు మాత్రం ఈ దాడుల విషయాన్ని అంగీకరిస్తున్నాయి. అయితే, గత అర్ధరాత్రి భారత్ సైన్యం జరిపిన దాడులకు పాక్ సైన్యం తగిన విధంగా బుద్ధి చెప్పిందని, అందుకే, అవి తోకముడిచాయనే కథనాలను ప్రసారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, భారత్ సైన్యం నిర్దేశిత దాడుల గురించి పాక్ ఆర్మీ ఇంతవరకూ ఎటువంటి ప్రకటన చేయకపోవడాన్ని పాకిస్థాన్ కు చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ సంస్థ (ఐఎస్ పీఆర్) కూడా పేర్కొంది.