Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేను తీవ్రవాదిని కాను... నాపై ఆ ముద్ర వేసిన అతనిపై చర్యలు తీసుకోండి: పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి ఆందోళన

2 వేల రూపాయల కోసం ఓ వ్యక్తి తనను టెర్రరిస్ట్ ను చేసేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలంటూ ముంబైలోని విరార్ పోలీస్ స్టేషన్ ఎదుట సయీద్ అలీ ఖాన్ అనే వ్యక్తి ఆందోళన చేపట్టాడు. వివరాల్లోకి వెళ్తే... విరార్ లోని గోపచద్ పాడా ప్రాంతంలో సయీద్ అలీ ఖాన్ (30) నివసిస్తున్నాడు. ఇంటి ఓనర్ అతనిని అద్దెపరంగా మరో 2,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. అందుకు తాను నిరాకరించడంతో ఆయన తనపై విషప్రచారానికి పూనుకున్నాడని తెలిపాడు. వాట్స్ యాప్, ఫేస్ బుక్ లో తాను తీవ్రవాదినంటూ పోస్టులు పెడుతున్నాడని, తనను పట్టుకుని పోలీసులకు అప్పగించాలని పోస్టులు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తనను అంతా అనుమానంగా చూస్తున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తూ పోలీసులను ఆశ్రయించగా వారు పట్టించుకోలేదు. దీంతో తన కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన ఆయన తన చేతిలో 'మై నేమ్ ఈజ్ సయీద్ అలీ ఖాన్ అండ్ అయామ్ నాట్ ఎ టెర్రరిస్ట్' అంటూ ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News