: నా జీవితంలో అసలు విలన్లే లేరు: ధోనీ


తన లైఫ్ లో విలన్లు ఎవరూ లేరని, ‘ధోనీ’ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలు ఉండవని టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ చెప్పాడు. ఈ నెల 30న ‘ఎమ్ఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ధోనీ మాట్లాడుతూ, ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన అరుణ్ పాండే తనకు ఎప్పటి నుంచో సన్నిహితుడని చెప్పాడు. ‘ధోనీ’ సినిమా తీయాలనే ఆలోచనతో అరుణ్ పాండే తన వద్దకు వచ్చినప్పుడు ముందు తాను అంతగా సుముఖత చూపలేదని అన్నాడు. తనకు సంబంధించిన సమాచారం చాలా ఈ చిత్రంలో ఉంటుందని, గతంలో తాను ఖరగ్ పూర్ లో నాలుగు సంవత్సరాల పాటు ఉన్నానని, అక్కడ ఏమి చేశాననే విషయం తన సొంత ఊరు వారికి కూడా తెలియదని అన్నాడు. ఈ చిత్రానికి సీక్వెల్ తీయడం లేదని, అలా తీయాల్సి వస్తే సినిమా నిండా మొత్తం విలన్లే ఉండాల్సి వస్తుందని చమత్కరించాడు. ఎందుకంటే, 2011 వరల్డ్ కప్ తర్వాత తన జీవితంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని ధోనీ చెప్పాడు.

  • Loading...

More Telugu News