: దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ ఎప్పటికీ మరిచిపోలేను: కత్రినా కైఫ్
స్మితా పాటిల్ అవార్డు తనకు రావడంపై పలువురు పలురకాల అభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ, ఈ అవార్డు ఇచ్చే వారికే తన గురించి పూర్తిగా తెలుసు కనుకే ఇచ్చారని బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ చెప్పింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'స్మితాపాటిల్ అవార్డు తనకు ప్రకటించగానే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ నాకు మద్దతుగా నిలుస్తూ చేసిన ట్వీట్ ను నేను ఎన్నటికీ మరవలేను' అని చెప్పింది. వర్మ ట్వీట్ లో తన గురించి చెప్పిన ప్రతి విషయం వాస్తవమేనని, ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తనకు డ్యాన్స్, నటన గురించి ఏమీ తెలియదని చెప్పింది. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అవి నేర్చుకోవడమంటే గొప్పే కదా? అని కత్రినా చెప్పుకొచ్చింది.