: ట్రంప్ ను కడిగేసిన హిల్లరీ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో హల్ చల్!


తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ లో డొనాల్డ్ ట్రంప్ ను హిల్లరీ క్లింటన్ ఓడించిన సంగతి తెలిసిందే. ముఖాముఖి తలపడిన సందర్భంగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై హిల్లరీ విరుచుకుపడడం జరిగింది. ప్రధానంగా మహిళలను ఉధ్దేశించి డొనాల్డ్ ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన హిల్లరీ, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లేసేది వాళ్లేనని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ట్రంప్ చేసిన పంది (పిగ్గీ) వ్యాఖ్యలను ఆమె మీడియాకు విడుదల చేశారు. ఈ వీడియోలో ట్రంప్ మహిళలను పందులు, కుక్కలతో పోలుస్తాడని ఆమె పేర్కొన్నారు. మహిళలు గర్భం దాల్చడం కూడా ఇతనికి ఇబ్బందేనని, అలాంటి వారికి పురుషులతో సమానంగా జీతాలు ఎందుకివ్వాలని ప్రశ్నిస్తాడని ఆమె గుర్తుచేశారు. గతంలో మిస్ యూనివర్స్ గా గెలిచిన మిలీషియా మచాడో మరుసటి ఏడాది లావుగా తయారైంది. దీనిపై స్పందించిన ట్రంప్ ఆమెను ఈటింగ్ మెషీన్ గా అభివర్ణించాడు. అందుకే ఆమె పందిలా తయారైందని అవమానించాడు. 'అందాల పోటీలను ట్రంప్ నిర్వహిస్తాడు. అందులో పాల్గొనేవాళ్ల చుట్టూ తిరుగుతాడు. చివరికి వారినే అవమానిస్తాడు. అలాంటి ట్రంప్ తెలుసుకోవాల్సిందేంటంటే... అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆ పందుల్లాంటి మహిళలే ఓట్లేస్తారు' అని షాక్ ఇచ్చారు. ఊహించని ఈ పరిణామంతో ట్రంప్ బిత్తరపోయాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా సర్క్యూలేట్ అవుతోంది.

  • Loading...

More Telugu News