: నాన్ క్రికెటర్లలో అత్యధికం... రూ. 50 కోట్ల డీల్ పై పీవీ సింధూ సంతకం!


ఇండియాలో క్రికెట్ మినహా మిగతా అన్ని క్రీడల్లోని ఆటగాళ్లెవరికీ సాధ్యంకాని భారీ డీల్ రియో సంచలనం, బ్యాడ్మింటన్ రజతపతక విజేత పీవీ సింధూ చేతికి చిక్కింది. స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ కంపెనీగా సేవలందిస్తున్న 'బేస్ లైన్' ఆమెతో మూడేళ్ల పాటు కాంట్రాక్టును కుదుర్చుకుంది. ఇందుకోసం సింధూకు రూ. 50 కోట్లు అందనున్నట్టు తెలుస్తోంది. అధికారికంగా ఎంత మొత్తం ఆమెకు ఆఫర్ చేశారన్న విషయాన్ని బేస్ లైన్ వెల్లడించలేదు. తమతో డీల్ పై సింధూ సంతకం చేసిందని సంస్థ సహ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ తుహిమ్ మిశ్రా వెల్లడించారు. "ఆమెకు ఇండియాలో పెరుగుతున్న పాప్యులారిటీతో ఎన్నో కంపెనీలు బ్రాండింగ్ కోసం వస్తున్నాయి. వచ్చే మూడేళ్లలో సింధూ బ్రాండ్ వాల్యూను మరింతగా పెంచేందుకు కృషి చేస్తాం. బ్రాండ్ ప్రొఫైలింగ్, లైసెన్సింగ్, వివిధ కంపెనీలతో ఒప్పందాలను మేము పర్యవేక్షిస్తాం. ఆమె అతి త్వరలో 9 కంపెనీలకు ప్రచారకర్తగా సంతకాలు చేయనుంది" అని తుహిమ్ తెలిపారు.

  • Loading...

More Telugu News