: రైల్వే పోలీస్ కానిస్టేబుల్ కు ట్విట్టర్ ద్వారా శాల్యూట్ చేసిన అక్షయ్ కుమార్


తన ఉద్యోగ విధులను సక్రమంగా నిర్వర్తించిన ఓ కానిస్టేబుల్ కు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ట్విట్టర్ మాధ్యమంగా సెల్యూట్ చేయడమే కాకుండా, ఆ వీడియోను షేర్ కూడా చేశాడు. దేశభక్తిని ప్రతిబింబించే 'బేబీ', 'ఎయిర్ లిఫ్ట్', 'రుస్తుం' సినిమాలతో అందర్నీ ఆకట్టుకున్న అక్షయ్ కుమార్, ట్విట్టర్ లో ఓ వీడియో చూశాడు. ఆ వీడియోలో వేగంగా వెళ్తున్న రైలు నుంచి ఓ మహిళ కిందికి దిగింది. అపసవ్య దిశలో దిగడంతో ఆమె కిందపడింది. ఈ వేగాన్ని తట్టుకోలేకపోయిన ఆమె ఫ్లాట్ ఫాం, రైలుకి మధ్యనున్న ఖాళీలోకి వెళ్లిపోబోయింది. అక్కడే వుండి దానిని గమనిస్తున్న ఓ కానిస్టేబుల్ వెంటనే స్పందించి, వేగంగా వెళ్లి ఆమెను ఆ గ్యాప్ లో పడిపోకుండా బయటకు లాగేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇంతలో మరికొందరు వచ్చి ఆమెను పరామర్శించడం వీడియోలో కనిపిస్తుంది. దీనిపై కామెంట్ చేసిన అక్షయ్ కుమార్... గతంలో తాను చాలా సార్లు చెప్పినట్టు పోలీసులే నిజమైన హీరోలు అన్నాడు. ఈ వీడియో చూసి గుండె ఆగినంత పనైందని తెలిపాడు. 'సమయస్ఫూర్తితో వ్యవహరించిన లోనావాలా పోలీస్‌ స్టేషన్‌ కు చెందిన కానిస్టేబుల్‌ పవన్‌ తాయ్‌ డేకు సెల్యూట్‌' అంటూ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News