: రాజకీయ నేతల జీవితంలో విలువలు పడిపోయాయి: ప్రధాని మోదీ


రాజకీయ నేతల జీవితాల్లో విలువలు పడిపోయానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేరళలోని కోజికోడ్ లో జరుగుతున్న చివరి రోజు బీజేపీ జాతీయ మండలి సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘కాలికట్.. కోజికోడ్ అయింది. భారతీయ జన సంఘ్ నుంచి మేము భారతీయ జనతా పార్టీగా మారాం. అధికారం కోసమే ప్రయత్నం చేసి ఉంటే.. రాజకీయ యాత్రలో మేమూ రాజీ పడేవాళ్లం. ఏళ్ల తరబడి విపక్షంలో ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. స్వాతంత్ర్య పోరాట సమయంలో నేతల జీవితాలు ఆదర్శంగా ఉండేవి. అయితే, స్వాతంత్ర్యం తర్వాత రాజకీయ నేతల జీవితాల్లో మార్పు వచ్చింది. రాజకీయ నేతల జీవితాల్లో విలువలు పడిపోయాయి. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో రాజకీయ నేతల పట్ల ప్రజలు చూస్తున్న వైఖరిలో మార్పు తీసుకురాలేమా? రాజకీయ నాయకుల్లో ఇప్పటికీ మంచివారు ఉన్నారు. ముస్లింలను ఓటు బ్యాంకుగా చూడొద్దని 50 ఏళ్ల క్రితమే పండిట్ దీన్ దయాళ్ చెప్పారు. సమాజంలో అట్టడుగున ఉన్నవారు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి’ అని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు.

  • Loading...

More Telugu News