: మైక్రోమాక్స్ నుంచి కాన్వాస్ 5 లైట్.. ధర రూ.6,499


ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ మైక్రోమ్యాక్స్ కాన్వాస్ సిరీస్‌లో భాగంగా తాజాగా శుక్రవారం 'కాన్వాస్ 5 లైట్' స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉండే ఈ ఫోన్ ధరను రూ.6,499గా పేర్కొంది. ఫీచర్ల విషయానికి వస్తే ఐదంగుళాల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 8 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ముందు కెమెరా, 16 జీబీ ఇన్‌బిల్ట్ మెమరీ, 4 జీ ఎల్టీఈ, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్‌లో ఉన్నాయి. తక్కువ ధరలో అన్ని ఫీచర్లు అందుబాటులో ఉండే ఈ ఫోన్‌కు వినియోగదారుల నుంచి డిమాండ్ ఉంటుందని మైక్రోమ్యాక్స్ పేర్కొంది.

  • Loading...

More Telugu News