: డియర్ సీఎం... మీ గురించి దేవుడిని ప్రార్థిస్తున్నా: రజనీకాంత్
అనారోగ్యం బారినపడి చెన్నై గ్రీమ్స్ రోడ్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత త్వరగా కోలుకోవాలని సూపర్ స్టార్ రజనీకాంత్ ఆకాంక్షించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "డియర్ సీఎం... మీరు త్వరగా ఉపశమనం పొందాలని దేవుడిని ప్రార్థిస్తున్నా" అని అన్నారు. జయలలిత నిన్న తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తీవ్ర జ్వరంతో బాధపడుతుంటే, ఆమెను ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. ఇక ఆమె త్వరగా కోలుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు పూజలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పరిస్థితి కుదుటపడిందని, పూర్తిగా కోలుకోగానే డిశ్చార్జ్ చేస్తామని అపోలో హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ వెల్లడించారు.