: తిరుమల మొదటి కనుమ దారిలో బోల్తాపడ్డ సుమో
తిరుమల మొదటి కనుమదారిలో సుమో బోల్తాపడింది. విశాఖపట్టణం జిల్లాకు చెందిన భక్తులు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకుని కొండపై నుంచి తిరుపతికి తిరుగు పయనమయ్యారు. వేగంగా సుమోను నడుపుతున్న డ్రైవర్ మలుపుల వద్ద నియంత్రించలేకపోవడంతో ఏడవ మైలు వద్ద సుమో బోల్తాపడింది. ఈ సమయంలో సుమోలో మొత్తం 11 మంది ఉన్నారు. వారిలో నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఒక బాలుడికి తీవ్రగాయాలు కాగా, మిగిలినవారికి స్వల్పగాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు, క్షత గాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు.