: అమీర్‌పేట్ శ్రీనగర్ కాలనీలో నేలకూలిన భారీ వృక్షం
హైదరాబాద్‌లో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి తోడు ఈరోజు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడే నీరు నిలిచిపోయింది. నగరంలోని అమీర్‌పేట్ పరిసర ప్రాంతాల్లో కురిసిన వర్షానికి అక్కడి రోడ్లు జలమయమయ్యాయి. వర్షాలతో ఈరోజు అక్కడి శ్రీనగర్ కాలనీలో రోడ్డుపక్కన్న ఉన్న ఓ భారీ వృక్షం నేలకూలింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెట్టుని తొలగించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అక్కడి ట్రాఫిక్‌ను అదుపులోకి తెచ్చేందుకు ట్రాఫిక్ పోలీసులు యత్నిస్తున్నారు.