: యువ‌కుడి ప్రాణం తీసిన‌ సెల్ఫీ పిచ్చి.. వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన వైనం!


సెల్ఫీ తీసుకునే సరదాతో ఇటీవ‌లే వరంగల్‌లోని ధ‌ర్మ‌సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్‌లో ప‌డి ఐదుగురు బీటెక్‌ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న మ‌రిచిపోక‌ముందే ఈరోజు వ‌రంగ‌ల్ జిల్లాలో అటువంటి ఘ‌ట‌నే మరొకటి జ‌రిగింది. మెదక్ జిల్లా జిన్నారం మండలం అక్కమ్మ చెరువు అలుగు వద్దకు రాము (24) అనే యువకుడు తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. భారీ వ‌ర్షాల ధాటికి నిండిపోయి ఉన్న‌ చెరువు వ‌ద్ద త‌న స్నేహితుల‌తో క‌లిసి సెల్ఫీ తీసుకునేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే, ఒక్క‌సారిగా వ‌ర‌ద ప్ర‌వాహంలో కొట్టుకుపోయాడు. రాముని ర‌క్షించేందుకు అత‌డి స్నేహితులతో పాటు స్థానికులు ప్ర‌య‌త్నించారు. అయిన‌ప్ప‌టికీ రాము ప్రాణాలు కోల్పాయాడు. చివ‌రికి యువ‌కుడి మృతదేహాన్ని స్థానికులు బయటకు తీశారు.

  • Loading...

More Telugu News