: తుర్క చెరువు, మూసాపేట్ చెరువులకు గండి...నీట మునిగిన పలు ప్రాంతాలు


హైదరాబాదులో కురిసిన వర్షానికి చెరువులకు గండ్లు పడుతున్నాయి. గత రాత్రి కురిసిన భారీ వర్షం ధాటికి మూసాపేట్ చెరువుకు గండి పడింది. దీంతో రాంకీ నగర్ నీట మునిగింది, పలు అపార్ట్ మెంట్ ల సెల్లార్లలోకి నీరు చొచ్చుకుపోయింది. నిజాంపేట్ లోని తుర్క చెరువుకు గండిపడింది. దీంతో నిజంపేట్ పరిసరాల్లోని కాలనీలన్నీ జలమయమయ్యాయి. గత ఐదేళ్లలో ఎన్నడూ కురవని వర్షాలు హైదరాబాదులో కురిశాయని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కూకట్ పల్లిలోని ఆల్విన్ కాలనీ, జీడిమెట్ల లోని సూరారం కాలనీల్లో నివాసాల్లోకి వర్షపు నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. పంజాగుట్ట, ఎర్రగడ్డ, కూకట్ పల్లి, బేగంపేట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో కూడళ్ల వద్ద రోడ్లపై వర్షం నీరు చేరింది.

  • Loading...

More Telugu News