: ఉండవల్లి పుస్తకం చదవండి..‘కాంగ్రెస్’ ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో తెలుస్తుంది: వెంకయ్యనాయుడు
విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాసిన పుస్తకం ‘విభజన కథ’ చదివితే తెలుస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. రాజమండ్రిలోని మధురపూడి విమానాశ్రయం విస్తరణ పనులకు ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, ఉండవల్లి ఏమీ చేయలేక తన ఆవేదనను ఈ పుస్తకంలో వెళ్లగక్కారని అన్నారు. ఎయిర్ పోర్ట్ విస్తరణ పనుల గురించి ఆయన మాట్లాడుతూ, రూ.181 కోట్లతో ఎయిర్ పోర్ట్ రన్ వే విస్తరణ జరుగుతుందని చెప్పారు. ఎయిర్ బస్ 320 విమానం సైతం ఇక్కడి ఎయిర్ పోర్ట్ లో దిగేలా రన్ వే అభివృద్ధి చెందుతుందని అన్నారు.