: డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ 'ప్రత్యూషా బెనర్జీ ఆత్మహత్య' నిందితుడు


'బాలికా వధు' సీరియల్ నటి ప్రత్యూషా బెనర్జీ ఆత్మహత్య ఘటనలో ప్రధాన నిందితుడు రాహుల్ రాజ్ సింగ్ డ్రంకెన్ డ్రైవ్ లో పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ సందర్భంగా అతని మాజీ ప్రియురాలు సలోని శర్మ కూడా అతనితోనే ఉండడం విశేషం. ముంబైలోని శాంతాక్రజ్ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా రాహుల్ రాజ్ సింగ్ అటువైపు వచ్చాడు. దీంతో పోలీసులు తనిఖీలకు ఉపక్రమించగా.. వారిని వారిస్తూ, ఉన్నతాధికారులకు చెబుతామని, తనిఖీలు చేస్తే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అదే కారులో ఉన్న రాహుల్ మాజీ ప్రేయసి సలోని పోలీసులను బెదిరించింది. ప్రత్యూష బెనర్జీని వివాహం చేసుకున్న తరువాత రాహుల్ రాజ్ సింగ్ ను వదిలేయాలని సలోని శర్మ ఆమెను పలుమార్లు బెదిరించిందని ప్రత్యూష స్నేహితులు పేర్కొన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News