: నెంబర్ వన్ న్యూస్ చానల్ యజమాని సాయి సుధాకర్ పై సీఐడీ ప్రశ్నల వర్షం


తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు గర్జన సభ అనంతరం చోటు చేసుకున్న విధ్వంసంపై నెంబర్ వన్ న్యూస్ చానల్ యజమాని సాయి సుధాకర్ పై సీఐడీ విచారణ బృందం ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. విచారణకు రావాలంటూ సీఐడీ పంపిన నోటీసులను అందుకున్న ఆయన, ఈ ఉదయం రాజమహేంద్రవరంలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి రాగా, తుని రైలు దహనం వెనుక ఆయన పాత్రపై తమ వద్ద ఉన్న సాక్ష్యాలను చూపిస్తూ, ఆయన్ను విచారిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డిని మరోసారి విచారించేందుకు సీఐడీ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News