: సికింద్రాబాద్ ఎలిఫెంటో వంతెన వద్ద రహదారిపై వరి మొక్కలు నాటిన టీడీపీ నేతలు
తెలంగాణలో రోడ్లు అధ్వానస్థితిలో ఉండడంతో ప్రయాణికులు, వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారంటూ తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు తెలంగాణలోని పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా ఈరోజు సికింద్రాబాద్‌లోని ఎలిఫెంటో వంతెన వద్ద టీడీపీ వినూత్న ధర్నాకు దిగారు. అస్తవ్యస్తమైన రోడ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ, రోడ్లు రహదారుల్లా కాకుండా వరినాటే పొలాల్లా ఉన్నాయంటూ రోడ్లపై వరిమొక్కలు నాటారు. టీడీపీ నేతల ఆందోళనతో వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. సికింద్రాబాద్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జీ సారంగపాణి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతోంది.