: ప్రాణం పోయినా చేతిని వదులుకోబోనన్న పాక్ యువతి.. వందోసారి ఆపరేషన్‌కు రెడీ!
ఆపరేషన్ అంటే చాలు చాలామంది భయంతో వణికిపోతుంటారు. అలాంటిది ఏకంగా వంద అపరేషన్లు అంటే మాటలా, ఎంత ధైర్యం కావాలి? అయితే ఎన్ని ఆపరేషన్లు అయినా పర్వాలేదు కానీ, తన చేతిని మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని చెబుతోంది పాకిస్తాన్ కు చెందిన ఫౌజియా యూసుఫ్. ఆమె ఎడమ చేతికి ఫైబ్రోమెటాసిన్ అనే అరుదైన వ్యాధి సోకింది. ఆ వ్యాధి సోకిన చేయిని తొలగించకుంటే ప్రాణాలకు ప్రమాదం తప్పదని వైద్యులు తెలిపారు. అయితే తన ప్రాణాలు పోయినా పర్లేదు కానీ చేతిని మాత్రం తొలగించుకోబోనని యవతి పట్టుబట్టింది. దీంతో వైద్యులు ఆమెకు ప్రత్యామ్నాయ ఆపరేషన్లు చేస్తున్నారు. ఆ వ్యాధి నుంచి ఫౌజియాను బటపడేసేందుకు ఇప్పటి వరకు 99 ఆపరేషన్లు చేసిన వైద్యులు తాజాగా వందో ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. ఫౌజియా కూడా సంతోషంగా ఆపరేషన్ టేబుల్ ఎక్కింది. అంతేకాదు, ఇంకెన్ని ఆపరేషన్లకైనా తాను సిద్ధమేనని పేర్కొంది. ఆమె ధైర్యానికి వైద్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.