: ఏంటీ రోడ్ల అధ్వానం?... చేసిన మంచి పనులన్నీ వేస్ట్ అవుతున్నాయి: కేటీఆర్


హైదరాబాద్ నగరంలో అధ్వానంగా మారిన రహదారులన్నింటినీ తక్షణం మరమ్మతులు చేయాలని తెలంగాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రోడ్లు పూర్తిగా పాడైన విషయాన్ని ప్రస్తావిస్తూ, మిగతా పనులన్నీ పక్కనబెట్టి, రోడ్లను బాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నా, రోడ్లు బాగాలేకుంటే వృథాయేనని అన్నారు. అధికారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని, గుంతలు, ఎగుడుదిగుడు దారుల్లో ప్రయాణించే వారు మొదట తిట్టేది ప్రభుత్వాన్నేనని చెప్పిన కేటీఆర్, తక్షణం ప్రాధాన్య క్రమంలో రోడ్లన్నింటినీ బాగు చేయాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News