: మనసులో నిరంతరం 'ఓం నమశ్శివాయ' అనుకుంటాను!: సుబ్బరామిరెడ్డి
నేను పైకి ఎలా వున్నప్పటికీ మనసులో నిరంతరం 'ఓం నమశ్శివాయ' అనుకుంటూనే ఉంటానని సుబ్బరామిరెడ్డి తెలిపారు. విశాఖపట్టణంలోని ఇందిరాప్రియదర్శని మున్సిపల్ స్టేడియంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, అందరూ ఆనందంగా ఉండాలన్నదే తన అభిమతమని అన్నారు. ఇలా ఎంతో మంది కళాకారులను సత్కరించడం తన పూర్వజన్మసుకృతమని ఆయన అన్నారు. మోహన్ బాబు చాలా మంచివాడని, అలాంటి వ్యక్తిని సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. గడిచిన 40 ఏళ్లే కాదు, ఇంకా ఎంతో కాలం ఆయన ఇలాగే ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా శివనామస్మరణ చేసిన సుబ్బరామిరెడ్డి ఆహూతులను అలరించారు.