: ఇండియా కలిసొస్తే అద్భుతాలే: అమెరికా

భారత్, అమెరికాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగితే ఎన్నో అద్భుతాలు సాధించవచ్చని, దీని ద్వారా ప్రపంచానికంతటికీ మేలు కలుగుతుందని వైట్ హౌస్ వెల్లడించింది. గతవారం లావోస్ లో భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపిన బరాక్ ఒబామా, తిరిగి అమెరికాకు చేరిన తరువాత వైట్ హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎన్నో అంశాలపై కలసి పనిచేసే అవకాశం ఉందని, భూతాపం విషయంలో అంతర్జాతీయంగా పలు సందేహాలు వచ్చినప్పటికీ, ఏకాభిప్రాయానికి రావడం సులువేనని, ఈ విషయంలో భారత్ నిర్మాణాత్మక పాత్ర పోషించాలని సూచించింది. వాతావరణ మార్పులపై వివిధ దేశాధి నేతలతో భారత ప్రధాని మోదీ సంప్రదింపుల వల్లే పారిస్ ఒప్పందం కుదిరిందని కొనియాడింది. ఒబామా, మోదీల నేతృత్వంలో రెండు దేశాల మధ్యా బంధం మరింతగా బలపడిందని, అందుకు ఒబామా గర్వపడుతున్నారని పేర్కొంది.

More Telugu News