: తెలంగాణలో మరో 273 పోస్టుల భర్తీకి అనుమతి
తెలంగాణలో ఖాళీగా ఉన్న డిప్యూటీ సర్వేయర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సర్వే, సెటిల్ మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖలో ఖాళీగా ఉన్న 273 డిప్యూటీ సర్వేయర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్ పీఎస్ సీ) ద్వారా ఈ ఉద్యోగాల భర్తీ జరగనుంది. కాగా, 1032 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి టీఎస్ పీఎస్ సీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.