Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తక్కువ సమయంలో ఎక్కువ పాప్యులారిటీ కోసమే 'న్యూడ్' ప్రకటన: ఇంతకాలానికి నిజం ఒప్పుకున్న పూనమ్ పాండే

అది 2011లో వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు జరుగుతున్న రోజులు... ఐదేళ్ల క్రితం జరిగిన ఈ పోటీల గురించి ఏ విషయం గుర్తున్నా, లేకున్నా పూనమ్ పాండే అనే మోడల్ పేరు మాత్రం గుర్తుకు వచ్చి తీరుతుంది. ఇండియా గెలిస్తే, తాను న్యూడ్ షో చేస్తానంటూ సంచలన ప్రకటనే చేసి రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోయింది. అప్పట్లో ఆ ప్రకటన ఎందుకు ఇచ్చానన్న విషయం వెనకున్న అసలు నిజాన్ని ఇప్పుడు పంచుకుందా భామ. తన గురించి అప్పట్లో పెద్దగా ఎవరికీ తెలియదని, తనకంటూ గుర్తింపును తెచ్చుకోవాలని భావించి, ఆ ప్రకటన చేశానని చెప్పింది. ఆ ప్రకటన తరువాత తాను ఊహించినంత పాప్యులారిటీ వచ్చిందని, సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయని చెప్పుకొచ్చింది. అయితే, అవన్నీ అందాల ఆరబోతకు చెందినవే కావడంతో, వాటిని వద్దనుకున్నానని వెల్లడించింది. పూనమ్ పాండే కేవలం మూడు సినిమాల్లో మాత్రమే కనిపించిన సంగతి తెలిసిందే.

More Telugu News