: దేశానికి ఎంతో ముఖ్యమైన సినిమాను చూశాను: నటుడు రానా


దేశానికి ఎంతో ముఖ్యమైన సినిమాను ఇప్పుడే చూసివస్తున్నానంటూ ప్రముఖ నటుడు రానా పేర్కొన్నారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించిన ‘పింక్’ చిత్రం ప్రత్యేక షోను తాను చూశానని, ఈ సినిమా దేశానికి ఎంతో ముఖ్యమైందని రానా తన ట్వీట్ లో పేర్కొన్నాడు. అంతేకాకుండా, గత కొన్ని రోజులుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ లో పలువురు బాలీవుడ్ నటులు ఈ చిత్రాన్ని చూశారు. అభిషేక్ కపూర్, కీర్తి సనన్, ప్రీతి జింటా, దియా మీర్జా తదితరులు తమ ట్వీట్ల ద్వారా ‘పింక్’ పై ప్రశంసలు కురిపించారు.

  • Loading...

More Telugu News