: ఢిల్లీని వణికిస్తున్న చికున్ గున్యా... మరో ఇద్దరి మృతి


దేశ రాజధాని వైరల్ జ్వరాలతో వణికిపోతోంది. చికున్ గున్యా, డెంగీ, మలేరియా జ్వరాలు అక్కడి వారిని అనారోగ్యం పాల్జేస్తున్నాయి. ఆస్పత్రుల్లో చేరుతున్న జ్వర బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మంగళవారం మరో ఇద్దరు చికున్ గున్యా కారణంగా స్థానిక గంగారామ్ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు జ్వరంతో మృతి చెందిన వారి సంఖ్య మూడుకి పెరిగింది. మున్సిపల్ విభాగం అధికారులు సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... సెప్టెంబర్ 10వ తేదీ నాటికి రాజధానిలో నమోదైన చికున్ గున్యా కేసులు 1,057. అలాగే, 1,158 డెంగీ కేసులు సైతం నమోదయ్యాయి. బాధితుల్లో వైద్యులు, వైద్య సిబ్బంది కూడా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రానున్న రోజుల్లో బాధితుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News