: తిరుమలలో భారీ కొండచిలువ హల్‌చల్!
తిరుమలలో తరచుగా పాములు కనిపిస్తూ శ్రీవారి భక్తులను హడలెత్తిస్తున్నాయి. కాలినడక దారిలోను, విశ్రాంతి భవనాల వద్ద పాములు అధికంగా కనిపిస్తూ భక్తులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈరోజు అటువంటి మరో ఘటన జరిగింది. విశ్రాంతి భవనం దగ్గర ఓ భారీ కొండచిలువ హల్‌చల్ చేసింది. కొండ చిలువను చూసి అక్కడి కార్మికులు పరుగులు తీశారు. వెంటనే అక్కడి అధికారులు సంబంధిత సిబ్బందికి సమాచారం అందించారు. పామును పట్టుకున్న సిబ్బంది దానిని అడవిలోకి వదిలేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న భక్తులు తమ సెల్‌ఫోన్‌లలో ఆ దృశ్యాలను చిక్కించుకోవడానికి పోటీ పడ్డారు.