: ఐఎస్ఐఎస్ కి షాక్...అధికార ప్రతినిధి హతం
ఐఎస్ఐఎస్ తీవ్రవాదులకు వరుస షాక్ లు తగులుతున్నాయి. పక్కా సమాచారంతో అమెరికా జరుపుతున్న వైమానిక దాడుల్లో ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన అగ్రశ్రేణి కీలక నేతలు హతమవుతున్నారు. తాజాగా అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద అధికార ప్రతినిధి అల్ అద్నానీ హతమయ్యాడు. దీంతో ఐఎస్ఐఎస్ కి ఊహించని దెబ్బతగిలింది. అల్ అద్నానీ హతమైన విషయం పెంటగాన్ అంగీకరించగా, ఐఎస్ఐఎస్ నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడం గమనార్హం. ఒకవైపు ఇరాక్ సంకీర్ణ సేనలు, మరోవైపు అమెరికా, రష్యా వైమానిక దాడులతో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ఇరాక్ లోని ఐఎస్ఐఎస్ చేతిలో ఉన్న నగరాలను సంకీర్ణ సేనలు స్వాధీనం చేసుకుంటుండగా, ఆ ఉగ్రవాద సంస్థ కీలక నేతలు హతమవుతున్నారు.