: కారు నడిపి, మనవడి భార్య ముచ్చట తీర్చిన ఎలిజబెత్ రాణి!
మనవడు ప్రిన్స్ విలియం సతీమణి కేట్ ముచ్చట తీర్చడం కోసం ఎలిజబెత్ రాణి-2 ఓ కారు నడిపారు. ప్రిన్స్ విలియం తన కుటుంబంతో కలిసి గత గురువారం ప్రిన్స్ చార్లెస్ ప్రైవేట్ ఎస్టేట్ బిర్క్ హాల్ కి వచ్చారు. ఈ సందర్భంగా వారితో కలిసి తమ బాల్మోరల్ ఎస్టేట్ లోని కొండల ప్రాంతానికి పిక్నిక్ కు వెళ్లారు. ప్రిన్స్ విలియం సతీమణి కేట్ తాము కూర్చున్న లాండ్ రోవర్ కారును నడపాలంటూ ఎలిజబెత్ రాణిని కోరారు. దీంతో, ఆమె స్వయంగా డ్రైవ్ చేసి మనవరాలి ముచ్చట తీర్చింది. ఆమె పక్క సీట్లో కూర్చున్న కేట్ నవ్వులు చిందించింది. తొంభై ఏళ్ల వయసులో కూడా ఆమె హుషారుగా కారు నడుపుతున్న ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది.