: గచ్చిబౌలిలో వినాయకుడి లడ్డూను వేలంలో దక్కించుకున్న ముస్లిం యువకుడు


హైదరాబాదు, సికిందరాబాదు జంట నగరాల్లో వినాయక ఉత్సవాలు మత సామరస్యానికి ముఖ్యంగా హిందూ, ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయని చెప్పడానికి ఇది మరో నిదర్శనం. వినాయక పూజలందుకున్న లడ్డూను వేలంలో దక్కించుకున్నాడో ముస్లిం యువకుడు. ఈ ఘటన శేరిలింగంపల్లి పరిధిలోని గచ్చిబౌలిలో జరిగింది. ఇక్కడి అంజయ్యనగర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక మండపం నెలకొల్పగా, మూడు రోజుల పాటు పూజలందుకున్న గణనాథుని చేతిలోని భారీ లడ్డూను విక్రయానికి వేలం పాట పెట్టారు. దీన్ని స్థానికంగా నివసించే అమీర్ భాయ్ రూ. 35 వేలకు పాటపాడి దక్కించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు అమీర్ ను అభినందిస్తున్నారు.

  • Loading...

More Telugu News