: ‘అనంత’లో కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు!... 9 మందికి తీవ్ర గాయాలు!
ఓ వైపు అసెంబ్లీలో టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా, మరోవైపు రాష్ట్రంలో ఆ రెండు పార్టీల కార్యకర్తల మధ్య ప్రత్యక్ష ఘర్షణలే చోటుచేసుకుంటున్నాయి. ఫ్యాక్షన్ ఖిల్లా అనంతపురం జిల్లాలో నేటి ఉదయం టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. జిల్లాలోని పరిగి మండలం పైడేటి గ్రామంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన మొత్తం 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.