: ‘డాన్’ పేరు మారింది!... దావూద్ ను ‘బడే హజరత్’గా పిలుస్తున్నారట!


భారత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను ఇప్పటిదాకా అతడి అనుచరులతో పాటు అతడితో సంబంధాలు నెరపుతున్నవారంతా ‘డాన్’గా పిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. ముంబై బాంబు పేలుళ్ల తర్వాత పాకిస్థాన్ కు పారిపోయిన దావూద్ ఆ దేశ వాణిజ్య నగరం కరాచీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య విలాసంగా జీవిస్తున్నాడు. ఇటీవల అతడితో బాలీవుడ్ కు చెందిన ఓ టాప్ స్టార్, పలువురు రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు పలుమార్లు ఫోన్లలో జరిపిన సంభాషణలు భారత నిఘా వర్గాల చేతికి చిక్కాయి. ఈ టేపుల్లో బాలీవుడ్ టాప్ స్టార్... దావూద్ ను ‘బడే హజరత్’గా సంబోధించాడట. దీంతో దావూద్ తన కోడ్ నేమ్ ను ‘డాన్’ నుంచి ‘బడే హజరత్’గా మార్చుకున్నట్లు స్పష్టమైంది.

  • Loading...

More Telugu News