: కవుల పేర్ల విషయంలో పొరపాటు పడ్డ పవన్ కల్యాణ్
కాకినాడలో ఈరోజు జరిగిన సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ ఒక సందర్భంలో పొరపాటు పడ్డారు. ‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని’ అంటూ దేశభక్తి గీతాన్ని ప్రస్తావించిన సందర్భంలో ఈ పొరపాటు జరిగింది. ఈ దేశభక్తి గీతాన్ని రాసింది రాయప్రోలు సుబ్బారావు. అయితే, దీన్ని రాసింది గురజాడ అప్పారావు అంటూ పవన్ పొరపాటుపడ్డారు.