: పవన్ కల్యాణ్ అడుగుతాడబ్బా... కొమ్ముకాశామబ్బా... అడగమా?: పవన్ కల్యాణ్


"నేను ప్రశ్నిస్తానని, విమర్శిస్తానని పలువురు పేర్కొంటుంటారు. వారందరికీ చెప్పేది ఒకటే... అడుగుతామబ్బా... కొమ్ముకాశాం.. అడగమా?" అని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలో జరిగిన సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో ఆయన మాట్లాడుతూ, ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చానని గుర్తుచేశారు. 'అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలను కష్టాలపాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఊరుకోము' అని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ నాయకులను సంపాదించుకోవద్దని తాను అనడం లేదని, ఒకవేళ తాను అలా చెప్పినా వారు సంపాదించుకోవడం మానరని, ఆ విషయం తనకు తెలుసని ఆయన చెప్పారు. అందుకే సొంత లాభం కొంత మానుకుని ప్రజల కోసం పాటుపడమంటున్నానని ఆయన తెలిపారు. అలా కాకుండా ప్రజల ప్రయోజనాలు ఫణంగా పెట్టి, సంపాదించుకుంటామంటే చూస్తూ ఊరుకోమని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News