: మీకు దెబ్బ తగిలితే...నాకు కన్నీళ్లు వస్తాయి!: అభిమానులను ఉద్దేశించి పవన్ కల్యాణ్
కాకినాడలోని జేఎన్టీయూ గ్రౌండ్ లో జరుగుతున్నా 'సీమాంధ్రుల ఆత్మ గౌరవ సభ' ప్రాంగణానికి సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖకు సహకరించాలని అభిమానులను ఆయన కోరారు. బారికేడ్లు తోసుకుని ముందుకు వచ్చేవారు, గోడలు, మేడలు, స్తంభాలు ఎక్కిన వారందర్నీ ఉద్దేశించి, 'మీరు పడిపోతే నాకు కన్నీళ్లు వస్తాయి. దయచేసి జాగ్రత్తగా ఉండండి' అని సూచించారు. 'మన పోలీసు శాఖకు సహకరిద్దామ'ని ఆయన సూచించారు. 'మీ కోసమే వచ్చాను, మన హక్కుల సాధన కోసమే వచ్చాను...మీతో మాట్లాడుతాన'ని ఆయన తెలిపారు.