: నేను ఫోన్ చేసినా ధోనీ లిఫ్ట్ లేయలేదు: యువరాజ్ సింగ్
యువరాజ్ సింగ్ ప్రారంభించిన 'యువీ కెన్' మార్కెట్లో న్యూ ప్రొడక్టులను విడుదల చేసిన వేళ, పలువురు క్రికెటర్లు హాజరు కాగా, మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం రాకపోవడంపై యువరాజ్ స్పందించాడు. ధోనీ ఎందుకు రాలేదని ఈ కార్యక్రమం కవరేజ్ కి వెళ్లిన మీడియా ప్రశ్నించగా, "చాలా బిజీగా ఉండటం వల్లే రాలేదనుకుంటాను. ఆహ్వానించాలని నేను ఫోన్ చేసినా ధోనీ లిఫ్ట్ చేయలేదు. ఒక్క నా ఫోన్ కే కాదు. చాలా మంది చేస్తున్న ఫోన్లను ధోనీ తీసుకోవడం లేదు. చాలా ఈవెంట్లతో బిజీగా ఉండటమే కారణమని భావిస్తున్నా" అన్నాడు. ధోనీ జీవిత కథతో తీసిన చిత్రం విడుదల కోసం తాను ఆసక్తిగా ఉన్నానని, ఆ చిత్రంలో తన పాత్రపై మరింత ఆసక్తి ఉందని చెప్పాడు. తన కథను సినిమాగా తీయాలని చాలా మంది అడుగుతున్నారని, తుది నిర్ణయానికి మాత్రం ఇంకా రాలేదని తెలిపాడు.