: చైనా నుంచి వచ్చిన అణు పరికరాలను ఉత్తర కొరియాకు పంపిన పాకిస్థాన్: కనిపెట్టిన యూఎస్ ఇంటెలిజెన్స్
సముద్ర మార్గం ద్వారా ఉత్తర కొరియాకు పాకిస్థాన్ నుంచి అణ్వస్త్ర పరిజ్ఞానం, అణు పరికరాలు వెళుతున్నాయని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజన్సీ (సీఐఏ) సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ సమాచారాన్ని రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్)తో పంచుకున్నట్టు తెలుస్తోంది. అణు బాంబుల తయారీలో వాడే మోనెల్, ఎన్కోనెల్ పదార్థాలు పాక్ అటామిక్ ఎనర్జీ కమిషన్ నుంచి ఉత్తర కొరియాకు చేరాయని, ఇది ఐక్యరాజ్యసమితి నిబంధనలకు పూర్తి విరుద్ధమని సీఐఏ వ్యాఖ్యానించింది. కాగా, పాకిస్థాన్ కు ఈ అణు పదార్థాలు చైనాకు చెందిన బీజింగ్ సన్ టెక్ టెక్నాలజీ కంపెనీ లిమిటెడ్ నుంచి రాగా, దాన్ని కార్గో షిప్ ద్వారా ఉత్తర కొరియాకు పంపినట్టు తెలుస్తోంది. ఇది చట్ట వ్యతిరేక లావాదేవీ అని ప్రపంచ భద్రతకు విఘాతం కలిగించే అంశమని సీఐఏ వ్యాఖ్యానించింది.