: శ్రీవారికి కోటికి పైగా విలువైన ఆభరణాలిచ్చి పేరు కూడా చెప్పకుండా వెళ్లిపోయిన భక్తుడు!
తిరుమలలో కొలువైన శ్రీవెంకటేశ్వరునికి భక్తుల నుంచి ఎంత పెద్దమొత్తంలో కానుకలు వస్తుంటాయో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన ప్రతి ఒక్కరూ తమ స్తోమతను బట్టి దేవదేవునికి కానుకలు, ఆభరణాలు సమర్పిస్తుంటారు. తాజాగా పేరును కూడా వెల్లడించకుండా, రసీదు తీసుకోకుండా ఓ భక్తుడు రూ. కోటికి పైగా విలువైన కానుకలను సమర్పించుకుని తన భక్తిని చాటాడు. ఏడు కిలోల బరువైన వెండి పద్మపీఠంతో పాటు రెండు కిలోల బరువైన బంగారు కవచం, మరో రెండు కిలోల బరువైన వెండి కిరీటాన్ని ఓ భక్తుడు శ్రీభూవరాహ స్వామి ఆలయంలో ఇచ్చి వెళ్లాడు. ఈ వ్యక్తి రసీదును కూడా పొందలేదు. దీనిపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం స్వామివారికి అజ్ఞాత భక్తులు కానుకలు ఇవ్వడం సహజమేనని అంటున్నారు.