: కేజ్రీ గొంతుకు సర్జరీ!... 15 రోజులు సెలవు పెట్టి బెంగళూరు వెళ్లనున్న ఢిల్లీ సీఎం!
ఏడాది క్రితం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సంక్రమించిన దగ్గు తగ్గలేదు. దీనిని తగ్గించుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సలహా మేరకు బెంగళూరులో పది రోజులకు పైగా చికిత్స తీసుకున్నా కూడా కేజ్రీకి ఉపశమనం కలగలేదు. ఈ నేపథ్యంలో సదరు దగ్గు నుంచి ఉపశమనం పొందేందుకు కేజ్రీ ఏకంగా గొంతుకు ఆపరేషన్ చేయించుకునేందుకు సిద్ధపడ్డారు. ఈ ఆపరేషన్ కూడా బెంగళూరులోనే జరగనుంది. ఈ ఆపరేషన్ కోసం 15 రోజుల పాటు సెలవు తీసుకుని ఆయన బెంగళూరు వెళ్లనున్నారు. ఈ నెల 13న ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకోనున్న ఆయన అక్కడే ఆపరేషన్ చేయించుకుని, ఆ తర్వాత 10 రోజుల రెస్ట్ అనంతరం తిరిగి ఢిల్లీలో అడుగుపెడతారట.