: పోలీసులు వస్తున్నారని తెలుసుకుని ముందే లొంగిపోయిన 'ఆప్' బహిష్కృత మంత్రి సందీప్ కుమార్
మహిళలతో అసభ్యకర రీతిలో కనిపించి మంత్రి పదవిని పోగొట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సందీప్ కుమార్ పై ఓ యువతి అత్యాచార కేసు పెట్టడంతో, పోలీసులు తనని అరెస్ట్ చేయడానికి ముందుగానే ఆయన లొంగిపోయారు. తనను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు వస్తున్నారని తెలుసుకున్న ఆయన డిప్యూటీ కమిషనర్ ఎదుట లొంగిపోయారు. ఢిల్లీ రాష్ట్రానికి సాంఘిక సంక్షేమ, మహిళా, శిశు శాఖలకు ఆయన మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయనకు చెందిన ఓ వీడియో బహిర్గతమై సంచలనం సృష్టించగా, మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. ఆ వీడియోలో కనిపిస్తున్న యువతే అత్యాచార కేసు పెట్టిన సంగతి తెలిసిందే. బాధితురాలి స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన ఢిల్లీ నార్తరన్ రేంజ్ జాయింట్ కమిషనర్ సంజయ్ సింగ్, ఐపీసీ సెక్షన్ 376 కింద సందీప్ పై కేసు పెట్టినట్టు తెలిపారు.