: కోగంటి సత్యంకు 14 రోజుల రిమాండ్.. గన్నవరం జైలుకు తరలింపు
నిన్న అరెస్టయిన విజయవాడ వ్యాపారవేత్త కోగంటి సత్యంను ఈరోజు కోర్టులో హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆయన్ని గన్నవరం జైలుకు తరలించాలని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో సత్యంను గన్నవరం జైలుకు తరలించారు. 307 సెక్షన్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. కాగా, డూండి గణేశ్ సేవాసమితికి సంబంధించిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ, కోగంటి సత్యం మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. నిన్న ఒక టీవీ ఛానెల్ లైవ్ కార్యక్రమంలో దేవినేని, కోగంటి ‘నువ్వు రౌడీ అంటే.. నువ్వు రౌడీ’ అని పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఉమ ఫిర్యాదు మేరకు కోగంటిని సూర్యారావుపేట పోలీసులు నిన్న రాత్రే అరెస్టు చేశారు.