: చైనా గాజువంతెన తాత్కాలికంగా మూసివేత


చైనాలోని జాగ్జియాంజి పార్కులో రెండు కొండలను కలుపుతూ ఉన్నగాజు వంతెన ప్రపంచంలోనే అత్యంత పొడవైన, ఎత్తైనది. గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్న ఈ గాజు వంతెనను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు చైనా పత్రికలు పేర్కొన్నాయి. గాజు వంతెనకు సంబంధించి ఇంటర్నల్ సిస్టమ్ ను ఆధునికీకరించే నిమిత్తమే దీనిని తాత్కాలికంగా మూసివేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే, ఉన్నపళంగా గాజు వంతెనను తాత్కాలికంగా మూసివేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించారు. కానీ, తిరిగి ఎప్పుడు ప్రారంభించేది చెప్పలేదు. దీంతో, పర్యాటకులు మండిపడుతున్నారు. ఇందుకు స్పందించిన నిర్వాహకులు సామాజిక మాధ్యమాల ద్వారా క్షమాపణలు చెప్పారు. కాగా, ఈ గాజు వంతెనపై రోజుకి 8,000 మంది పర్యాటకులను మాత్రమే అనుమతిస్తారు. కానీ, రోజుకు 10,000 మంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ఈనేపథ్యంలో తమ సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ లలో కొన్ని మార్పులు చేసేందుకుగాను గాజువంతెనను తాత్కాలికంగా మూసివేస్తున్నామని నిర్వాహకులు చెప్పారు. భూమికి 300 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గాజు వంతెన పొడవు 430 మీటర్లు.

  • Loading...

More Telugu News