: హైదరాబాద్‌లో విషాదం.. డ్రెస్సింగ్ టేబుల్ మీదపడి తొమ్మిది నెలల చిన్నారి మృతి
హైదరాబాద్ లోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్‌లో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. డ్రెస్సింగ్ టేబుల్ మీదపడడంతో అయాన్ అనే తొమ్మిది నెలల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతి చెందిన చిన్నారి రాంనగర్‌లోని అభయాంజనేయస్వామి దేవాలయం వీధిలో నివాసముంటున్న ప్రవీణ్, అనూష దంపతుల రెండో కుమారుడని పోలీసులు తెలిపారు. ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు అయాన్‌పై డ్రెస్సింగ్ టేబుల్ పడిందని వారు పేర్కొన్నారు. తమ చిన్నారి మృతి చెందడంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.