: బెజవాడలో నకిలీ కారం పొడి తయారీ!... కంది, కొత్తిమీర, పుదీనా పొడులు కూడా!


తెలుగు రాష్ట్రాల్లో నకిలీ నిత్యావసరాల తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో నకిలీ నెయ్యి తయారీ కలకలం రేపగా... తాజగా ఏపీ పొలిటికల్ కేపిటల్ విజయవాడ కేంద్రంగా నకిలీ కారం పొడి తయారీ వెలుగు చూసింది. నగరంలోని కొత్తూరు తాడేపల్లి రోడ్ లోని నీలిమ ఎంటర్ ప్రైజెస్ పేరిట ఏర్పాటైన కర్మాగారంలో నకిలీ కారం పొడి తయారీ యథేచ్ఛగా సాగుతోంది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు సదరు కర్మాగారంపై దాడులు చేశారు. ఈ సందర్భంగా అక్కడ నకిలీలతో తయారు చేసిన కారం, కంది, కొత్తిమీర, పుదీనా పొడులు బారీ ఎత్తున పట్టుబడ్డాయి. నకిలీ దందాపై నోరెళ్లబెట్టిన పోలీసులు కంపెనీ యజమాని వనం జనార్దన్ తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News