: ఓటుకు నోటు కేసు... 29లోపు చంద్రబాబుపై విచారణ జరిపి నివేదిక సమర్పిస్తాం
ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని విచారిస్తామని ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు మెమో దాఖలు చేశారు. కొత్త ఎఫ్ఐఆర్ అవసరం లేదని, పాత ఎఫ్ఐఆర్ ద్వారానే విచారణ కొనసాగిస్తామని ఏసీబీ అధికారులు ఆ మెమోలో తెలిపారు. సెప్టెంబర్ 29వ తేదీ లోపు చంద్రబాబుపై విచారణ జరిపి, నివేదిక సమర్పిస్తామని ఏసీబీ కోర్టుకు అధికారులు తెలిపారు.