: తెరచుకున్న హుస్సేన్ సాగర్ గేట్లు... జలదృశ్యాన్ని చూసేందుకు పోటెత్తిన ప్రజలు

హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ నీటిమట్టం పూర్తి స్థాయికి పెరిగి ప్రమాదకర స్థితికి రాగా, కొద్దిసేపటి క్రితం గేట్లను ఎత్తివేసి నీటిని మూసీ నదిలోకి వదిలారు. గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ సాగర్ తూములను స్వయంగా తెరిచారు. నురగలు కక్కుతూ కాలువ ద్వారా మూసీలోకి వెళుతున్న నీరు కనులకు విందు చేస్తుండగా, దాన్ని చూసేందుకు పెద్దఎత్తున నగర వాసులు వచ్చి చేరారు. జలాశయానికి వచ్చిన వరద నీటిని వచ్చినట్టు వదిలేస్తామని చెప్పిన అధికారులు, నీటి మట్టం పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించామని వెల్లడించారు.

More Telugu News