: తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. మూడు బిల్లులకు ఆమోదం తెలిపిన శాసనసభ
తెలంగాణ శాసనసభ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లుపై శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన అనంతరం అరగంట వాయిదాపడిన శాసనసభ మళ్లీ సమావేశమై మూడు బిల్లులకు ఆమోదం తెలిపింది. సైబరాబాద్ కమిషనరేట్ విభజన, వ్యాట్ సవరణ, దేవాలయాల పాలకమండళ్ల సభ్యుల సంఖ్య పెంపు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. కాగా, వచ్చేనెల 20 నుంచి పది రోజులపాటు శాసనసభ వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి.