: ఇకపై తమిళనాడులో ‘అమ్మ’ పార్క్ లు, ‘అమ్మ’ జిమ్ లు


తమిళనాడులో ‘అమ్మ’ క్యాంటీన్లు, ‘అమ్మ’ వాటర్, ‘అమ్మ’ కూరగాయలు, ‘అమ్మ’ మెడికల్ షాపులు,‘అమ్మ’ సిమెంట్... ఎన్నో పథకాలను సీఎం జయలలిత ప్రవేశపెట్టారు. తాజాగా, ‘అమ్మ’ పార్కులు, ‘అమ్మ’ జిమ్ సెంటర్లు నిర్మించనున్నారు. ఈ విషయాన్ని జయలలిత ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్లతో గ్రామ పంచాయతీల్లో పార్కులు నిర్మించనున్నట్లు తెలిపారు. టాయిలెట్స్, మంచినీటి సదుపాయం, కుర్చీలను పార్కుల్లో ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా, ఆట వస్తువులను కూడా పార్కుల్లో ఉంచనున్నారు. యువత ఫిట్ నెస్ కోసం తమిళనాడు వ్యాప్తంగా 500 జిమ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు జయలలిత పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News